ప్రాజెక్టు అమలు వివరాలు

  1. పరిశ్రమలకు కావాల్సిన మానవ వనరుల కోసం సీమెన్స్ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించే దిశగా సీమెన్స్ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ శిక్షణ ద్వారా డిజిటలైజేషన్‌లో భాగంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న పారిశ్రామిక మార్పులకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించారు. ఇలాంటి కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా తమిళనాడు, ఝార్ఖండ్, కర్ణాటక, చత్తీస్ ఘడ్ లో కూడా జరుగుతున్నాయి.
  2.  ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో 10శాతం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. మిగిలిన 90 శాతాన్ని డిజైన్‌టెక్, సిమెన్స్ సంస్థలు భరించాలి .
  3.  ఒక్కో క్లస్టర్‌కు రూ. 559.33 కోట్ల చొప్పున ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 3356 కోట్ల రూపాయిలు. రాష్ట్రప్రభుత్వం ఒక క్లస్టర్ కు రూ. 55 కోట్ల చొప్పున అందించాలి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆరు క్లస్టర్లకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 330 కోట్లు (టాక్సులు మినహాయించి). 
  4. మే 2018 నాటికి, 40 ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ లను గుర్తించి, వాటిలో 34 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు (T-SDI)ను, 6 సెంటర్ ఆఫ్ ఎక్షలెన్స్ (COE) ను 6 క్లస్టర్ల కింద ఏర్పాటు చేశారు. మార్చి 2020 నాటికీ, 2.3 లక్షల మంది అభ్యర్థులు ఈ శిక్షణా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ పొందారు.
  5. ఆగస్ట్ 2021 నాటికీ, అగ్రిమెంట్ లో ఉన్న 3 సంవత్సరాల (COVID కారణంగా పొడిగించబడింది) వ్యవధి తర్వాత ప్రాజెక్ట్ పరికరాలను, నిర్వహణను కాలేజ్ యాజమాన్యానికి అప్పగిస్తూ సీమెన్స్ కేంద్రాలు అక్నాలెడ్జ్ మెంట్ లెటర్స్ జారీ చేశాయి.
  6.  ఈ ప్రాజెక్టును అమలు చేసిన ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అధిక సంఖ్యలో క్లస్టర్‌లను ఏర్పాటు చేసి అనుకున్న దాని కంటే ఎక్కువ మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్ట్ అమలు చేసిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రభుత్వాలు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాయి.
  7.  గత ప్రభుత్వమైన టీడీపీ యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు చేసిన కృషి వలన 2018, 2019 సంవత్సరాలలో ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్‌, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
  8.  డిజైన్‌టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ వికాస్ ఖాన్వెల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, APSSDC, సిమెన్స్ మరియు షార్ట్ లిస్టు చేసిన కళాశాలల కో - ఆర్డినేషన్ తో ప్రాజెక్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయబడిందో వివరించారు.
  9. ఈ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినందుకు గానూ డా. అర్జా శ్రీకాంత్ (MD, APSSDC) డిజైన్‌టెక్‌ సంస్థకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ప్రాజెక్ట్ అంశంఆంధ్ర ప్రదేశ్గుజరాత్ఝార్ఖండ్తమిళనాడుకర్ణాటక
ప్రాజెక్ట్ ప్రారంభం20152013201620172017
ప్రభుత్వ సహకారం10%15%10%10%10%
మోడల్మొత్తం 40 ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటు చేశారు. హబ్ అండ్ స్పోక్ మోడల్‌ లో 6 క్లస్టర్స్ ఉంటాయి. ప్రతి క్లస్టర్ సుమారుగా 5 tSDI ( టెక్నీకల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌) లను, 1 CoE (సెంటర్ అఫ్ ఎక్సలెన్స్) ను కలిగి ఉంటుంది.మొత్తం 11 శిక్షణా సంస్థలుహబ్ అండ్ స్పోక్ మోడల్‌ లో 3 క్లస్టర్స్ ఉంటాయి. ప్రతి క్లస్టర్ సుమారుగా 5 tSDI ( టెక్నీకల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌) లను, 1 CoE (సెంటర్ అఫ్ ఎక్సలెన్స్) ను కలిగి ఉంటుంది.ఒక క్లస్టర్ 5 tSDI ( టెక్నీకల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌) లను, 1 CoE (సెంటర్ అఫ్ ఎక్సలెన్స్) ను కలిగి ఉంటుంది.మొత్తం 4 శిక్షణా సంస్థలు
రిఫరెన్సులుసీమెన్స్-డిజైన్ టెక్ ప్రతిపాదన
సీఐటీడీ వాల్యువేషన్
ఎకనామిక్ టైమ్స్
దేశ్ గుజరాత్
సీమెన్స్ ప్రెస్ రిలీజ్
MoU
టెలిగ్రాఫ్
అన్నా యూనివర్సిటీ DT నెక్స్ట్ తో ఎంఓయు
డిటీ నెక్స్ట్
ఎకనామిక్ టైమ్స్
డెక్కన్ హెరాల్డ్
క్రమ సంఖ్యకాలక్రమం ఈవెంట్స్
110th సెప్టెంబర్
2014
10-09-2014 నుండి ఉన్నత విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)ను ఏర్పాటు చేసే బాధ్యతలు చూసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms.No.47 జారీ చేసింది.

226th సెప్టెంబర్
2014
కంపెనీల చట్టం 2013, సెక్షన్ 8 కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)ని ఇన్ కార్పోరేట్ చేయటానికి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్‌లను ఆమోదిస్తూ ఉన్నత విద్యా శాఖ 26-09-2014న, G.O.Ms.No.48 జారీ చేసింది.

3
డిసెంబర్ 2014గుజరాత్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను సందర్శించిన టీమ్, వాటిపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసింది.
49 ఫిబ్రవరి 2015
సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు గుజరాత్ లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏపీ నుంచి వెళ్ళిన అధికార బృందం సందర్శించి, ఆ కేంద్రాలపై సమగ్ర అధ్యయనం చేసి, నివేదికను సమర్పించింది. ఆ తర్వాతే సీమెన్స్, డిజైన్ టెక్ ప్రతినిధులు సమర్పించిన ప్రతిపాదనపై ప్రభుత్వం ముందడుగు వేసింది.
516 ఫిబ్రవరి 2015APలో సీమెన్స్ కేంద్రాల యొక్క ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకి మంత్రిమండలి 1196 వ మీటింగ్ లో ఆమోదం తెలిపింది.

604 మార్చి 20151197వ రాష్ట్రమంత్రి వర్గ సమావేశంలో, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వ వాటా కింద పెట్టాల్సిన మొత్తానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సీమెన్స్ ప్రాజెక్ట్ కోసం రూ. 360 కోట్లు కేటాయించారు. అదే మొత్తాన్ని TSP కింద రూ. 25 కోట్లు, SCSP కింద రూ. 42 కోట్లు, జనరల్ హెడ్ కింద రూ. 293 కోట్లు బడ్జెట్ ప్రపోజల్స్ పంపారు.
712 మార్చి 20152015-16 రాష్ట్ర బడ్జెట్ లో ప్రాజెక్ట్ కి కావాల్సిన వ్యయాన్ని శాసనసభ ఆమోదించింది.
830 జూన్ 2015G.O M.S No. 4 dt 30.06.2015 ద్వారా 6 క్లస్టర్ల స్థాపనకు ప్రభుత్వం అనుమతినిచ్చి APSSDC MD&CEO అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ ను నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చింది.
95 అక్టోబర్ 201505-10-2015 న, G.O Ms. No. 8 కింద సీమెన్స్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించడానికి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ట్రైనింగ్ ను పరిశీలించటానికి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1021st October 2015శ్రీ ఎల్. ప్రేమ్ చంద్రా రెడ్డి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించి 31 మార్చి 2016 వరకు పదవిలో కొనసాగారు.
115 నవంబర్ 2015ఒక బృందం 2015 నవంబర్ 5 & 6 తేదీలలో గుజరాత్‌లో స్థాపించబడిన సీమెన్స్ కేంద్రాలను సందర్శించి, అధ్యయనం చేసి, నివేదికను సమర్పించింది (బృంద సభ్యులు : శ్రీ ఎల్ ప్రేమచంద్రారెడ్డి IAS, సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. శ్రీమతి కె సునీత IAS, సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్. K లక్ష్మీనారాయణ, డైరెక్టర్ APSSDC. డాక్టర్ ఘంటా సుబ్బారావు, Spl సెక్రటరీ స్కిల్ డెవలప్‌మెంట్)
127 నవంబర్ 2015ఆ బృందం నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించి, APSSDCకి నిధుల మొత్తాన్ని విడుదల చేయమని సిఫార్సు చేసింది.
134 డిసెంబర్ 2015ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా అందించాల్సిన ప్రాజెక్ట్ వ్యయం 330 కోట్లు కాగా, అందులో ప్రతి క్లస్టర్‌కు ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం - అంటే 55 కోట్లు (పన్నులు మినహాయించి) అందించాలని స్కిల్ డెవలప్‌మెంట్ సెక్రటరీ శ్రీ ఎల్. ప్రేమ్‌చంద్రారెడ్డి అడిషనల్ అగ్రిమెంట్ చేసారు.
1418 డిసెంబర్ 2015

డిజైన్‌టెక్ మరియు సీమెన్స్ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వాల్యుయేషన్‌ను ధృవీకరించడానికి, భారత ప్రభుత్వం స్థాపించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD)కి APSSDC లేఖ రాసింది. మూడు దశాబ్దాలకు పైగా ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రఖ్యాత సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్.
1518 మార్చి 2016ఒక్కో క్లస్టర్‌కు రూ.559.33 కోట్లు ప్రాజెక్టు వ్యయం సహేతుకమైనదని CITD వాల్యుయేషన్‌ రిపోర్ట్ లో పేర్కొంది.
1631 మార్చి 2016APSSDC ద్వారా, ప్రాజెక్ట్ ‌నిర్వహించినందుకు చివరి విడత కింద రూ.34.30 కోట్లును డిజైన్ టెక్ కి విడుదల చేశారు. డిజైన్‌టెక్‌కు సంబంధించిన అన్ని నిధులను (మొత్తం రూ.371.25 కోట్లు ) స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, ఎండీ శ్రీ ఎల్. ప్రేమచంద్రారెడ్డి విడుదల చేశారు.
1725 ఏప్రిల్ 2016రాష్ట్ర ప్రభుత్వం 25.04.2016 న Go.MS.No. 05 SDE&I(SKILLS) విభాగం ద్వారా, సీమెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేయటానికి ఇన్‌స్టిట్యూట్లను ఎంపిక చేయమని ఉత్తర్వులు జారీ చేసింది.
1831 మే 2017
మే 2017 నాటికి, రెండు సీమెన్స్ కేంద్రాలు లాబరేటరీలతో సహా ఏర్పాటు చేయబడి శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. విజయవాడ లోని V.R సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల , గుంటూరులోని VVIT కాలేజ్
1931 డిసెంబర్ 201740 సెంటర్లకి 19 సీమెన్స్ సెంటర్ల ఏర్పాటును డిజైన్‌టెక్ పూర్తి చేసింది.
2031 మే 2018మొత్తం 40 సీమెన్స్ సెంటర్స్ ఏర్పాటును డిజైన్ టెక్ పూర్తి చేసింది
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టు కొనసాగింది
21ఫిబ్రవరి 2020రాష్ట్రవ్యాప్తంగా 40 (CoEs & tSDIలు) కేంద్రాలను విజయవంతంగా నిర్వహించినందుకు, లక్షమందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి,ఉపాధి పొందే మార్గాన్ని చూపెందుకు డిజైన్‌టెక్ చేస్తున్న కృషిని అభినందిస్తూ డా. అర్జా శ్రీకాంత్ (MD, APSSDC) లేఖ రాశారు.
2231 మార్చి 2020సీమెన్స్ కేంద్రాల్లో 2,13,000 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు.
23ఆగస్టు 2021డిజైన్‌టెక్, సిమెన్స్ కేంద్రాలకు సంబంధించిన పరికరాల, ఆస్తుల యాజమాన్యాన్ని APSSDC, జాయింట్ ఆపరేషనల్ కంట్రోల్‌ హోస్టింగ్ సంస్థకి అప్పగించారు.
క్లస్టర్ వారిగా సీమెన్స్ కేంద్రాల ప్రభావం
క్లస్టర్ పేరు సుమారుగా ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు
అనంతపురం37,500
గుంటూరు35,500
విశాఖపట్నం34,000
తూర్పు గోదావరి34,000
కృష్ణ39,000
చిత్తూరు37,500
మొత్తం2,13,000
ఉద్యోగాలు వచ్చిన విద్యార్థుల సంఖ్య70,000

సంబంధిత డాక్యుమెంట్లు:

డాక్యుమెంట్వివరణ
సీమెన్స్ శిక్షణ డేటా

ఫిబ్రవరి 2021 వరకు సీమెన్స్‌ కేంద్రాలలో శిక్షణ పొందిన విద్యార్థుల జాబితా సంవత్సరాల వారీగా.

కృష్ణ క్లస్టర్

విశాఖపట్నం క్లస్టర్

అనంతపూర్ క్లస్టర్

గుంటూరు క్లస్టర్

తూర్పు గోదావరి క్లస్టర్

చిత్తూరు క్లస్టర్

సెంటర్లున్న 40 కళాశాలల లిస్ట్

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతిRGUKT, నూజీవీడు
జె ఎన్ టి యు కాకినాడసెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల, కాకినాడ
SV ఇంజనీరింగ్ కళాశాల తిరుపతిజిజియుకెటి, కడప
సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విజయవాడఅనంతలక్ష్మి ఇన్‌స్టిట్యూట్, అనంతపురం
వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ గుంటూరుడి ఎన్ ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ
జె ఎన్ టి యు అనంతపురంఎమ్ వీ జి ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం
ఆర్ జి ఎమ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నంద్యాలప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, కాకినాడ
ఆర్ వీ ఆర్ & జే సీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరువిజ్ఞాన్ యూనివర్సిటీ, వడ్లమూడి, గుంటూరు
పుత్తూరు సిద్దార్ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ఆదిత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టెక్కలి
ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, కాకినాడజి ఎమ్ ఆర్ పాలిటెక్నిక్, శ్రీశైలం
అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ రాజంపేటప్రభుత్వ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, పాడేరు
ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనంతపురంప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం
మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మదనపల్లెప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురం, నెల్లూరు
ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల, కందుకూరుగాయత్రి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కాకినాడ
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, కుప్పంవిద్యానికేతన్ , తిరుపతి
ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడసి ఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఏలూరు
పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, అనంతపురంప్రభుత్వ పాలిటెక్నిక్ శ్రీకాకుళం
గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, కాకినాడఇండో-జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖపట్నం
జి ఎమ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకినాడశ్రీ సిటీ, తడ
ప్రభుత్వ పాలిటెక్నిక్, బెంజ్ సర్కిల్, విజయవాడఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల
క్రమ సంఖ్యవార్తా పత్రికసారాంశం
1The Hindu :విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసేందుకు సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
(15/5/2018)
ఆంధ్రా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (AUCOE)లో 'సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం జర్మన్ సంస్థ సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిని త్వరలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
2The Hindu :నైపుణ్యాభివృద్ధి శిక్షణకు పెద్దపీట
(10/3/2016)
మే 1 న 3,300 కోట్ల సీమెన్స్ పెట్టుబడితో (330 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా) ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో సీమెన్స్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కార్మిక & ఉపాధి శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వ్యక్తపరిచారు.
3The Hindu :విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా తీర్చిదిద్దాలి
(19/08/2015)
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఎంపిక ప్రక్రియ నిర్దిష్ట ప్రమాణాలు మరియు ఆడిట్‌ల ఆధారంగా ఉంటుందని APSSDC మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO ఘంటా సుబ్బారావు పేర్కొన్నారు.
4The Hindu:స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆరు ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది
(24/7/2015)
APSSDC సీమెన్స్‌తో కలిసి రాబోయే కొద్ది నెలల్లో ఆరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లను ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల & సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ బి. ఉదయ లక్ష్మి తెలిపారు.
5The Hindu :ఏయూలో రెండు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు
(8/01/2018)
సీమెన్స్‌ ద్వారా భారీ పరికరాలను ఉంచడానికి ప్రత్యేక బ్లాక్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని దీనికి అధికారికంగా సీమెన్స్ సెంటర్ అని పేరు పెట్టామని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ చెప్పారు.

6The Hindu :APT-SDI కేంద్రాన్ని హోస్ట్ చేయడానికి SACET
(30/4/2016)
సీమెన్స్‌ సహకారంతో ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రకాశం జిల్లాలో ఎంచుకోబడ్డ రెండు కాలేజీల్లో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ ఒకటి.

7The Hans India :సీమెన్స్ SDI అన్ని కోర్సులను అందిస్తుందిసెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీలో కాలేజ్ లో సీమెన్స్ సెంటర్ ద్వారా అన్ని కోర్సులను అందిస్తున్నట్లు APSSDC ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ B నాగేశ్వరరావు వెల్లడించారు.
8The Hans India :వెల్డింగ్లో శిక్షణా కోర్సు ప్రారంభమవుతుంది
(28/11/2018)
శ్రీ సిటీ-సీమెన్స్ టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ లో 23 మంది ట్రైనీల కోసం రెండు వారాల వెల్డింగ్ ట్రేడ్‌ ఎక్స్‌పర్ట్‌-స్థాయి కోర్సు మంగళవారం ప్రారంభమైంది.
9The Hans India :SACET చీరాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తుంది
(13/9/2018)
చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను నిర్వహించింది.
10The Hans India :విద్యార్థులు సాంకేతిక వనరులను వినియోగించుకోవాలని సూచించారు
(29/03/2018)
కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల APSSDC మరియు సీమెన్స్‌ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ సహకారంతో 75 మంది బాలికలకు 10 రోజుల సీమెన్స్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
క్రమ సంఖ్యఏజెన్సీపత్రం
1ప్రణాళికా విభాగం, ఉత్తరప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి విశ్లేషణ
2అభివృద్ధి, పర్యవేక్షణ మరియు మూల్యాంకన కార్యాలయం (నీతి ఆయోగ్)కేస్ స్టడీ
3కేపీఎంజి సంస్థ‘ఇండియా సోర్స్ హయ్యర్' నివేదిక
పలు నివేదికలలో ఏపీ సీమెన్స్ ప్రాజెక్టు
4ఆంధ్రా యూనివర్సిటీవేసవి ఇంటర్న్‌షిప్ లేఖ
5శ్రీ విద్యా నికేతన్సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ బ్రోచర్
6ఆంధ్రా యూనివర్సిటీవార్షిక నివేదిక
7వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ"సాలిడ్ ఎడ్జ్"పై ఆరు రోజుల వర్క్‌షాప్
8అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్వర్క్‌షాప్ నివేదిక
9రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ - RK వ్యాలీవార్షిక నివేదిక
10అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్లు
11గాయత్రీ విద్యా ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలAPSSDC SIEMENS ల్యాబ్‌లు
12DNR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీAPSSDC SIEMENS ల్యాబ్‌లు
13RVR & JC ఇంజనీరింగ్ కళాశాల, చౌడవరం, గుంటూరుశిక్షణ వివరాలు
14జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడసర్కులర్

అవును. మంత్రి మండలి ప్రాజెక్ట్ ప్రతిపాదనను మూల్యాంకనం చేసి ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేసి 2015-16 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

APSSDC గుజరాత్‌లోని సీమెన్స్‌ కేంద్రాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నివేదికను సమర్పించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ ఖర్చులు మరియు క్లస్టర్ మోడల్‌ను వివరిస్తూ GO.MS.NO.4 30/06/2015 (స్కిల్ డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్‌మెంట్ కింద https://goir.ap.gov.in/ https://goir.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉంది) విడుదల చేయబడింది.

సంబంధిత పత్రాలు:

  
డాక్యుమెంట్

వివరణ

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని స్థాపించడం - ఎక్సలెన్స్ GOOO

G.O.Ms.No. G.O.Ms.No. 4 - స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ & ఇన్నోవేషన్ డిపార్ట్‌మెంట్ - ప్రాజెక్ట్ క్లియరెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIEMENS సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEలు), టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌లు (TSDIలు) , స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను (SDCలు) ఏర్పాటు చేయడం – అవగాహన ఒప్పందానికి (MOU) ఆమోదం - ఉత్తర్వులు – జారీ చేయబడ్డాయి.

సిమెన్స్‌పై మానిటర్ కమిటీ

G.O.Ms.No.8 G.O.Ms.No.8 -స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు ఇన్నోవేషన్ డిపార్ట్‌మెంట్ – ఫార్మేషన్ SIEMENS ప్రాజెక్ట్ ప్రోగ్రామ్‌ను పర్యవేక్షించడానికి కమిటీల - ఆర్డర్-జారీ చేయబడింది.

క్యాబినెట్ తీర్మానం

కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజల్యూషన్ నెం.33/2015 - ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

అవును, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ద్వారా వివరణాత్మక ఎవాల్యూయేషన్ జరిగింది, ఇది సిమెన్స్ మరియు డిజైన్‌టెక్ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వ్యయం సరైనదేనని నిర్ధారించింది. ప్రతి క్లస్టర్‌కు సిమెన్స్ నిర్దేశించిన రూ. 559.33 కోట్ల వ్యయం ఆమోదయోగ్యమైనదిగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ధృవీకరించింది.

  1. వివిధ సర్వీసులు కోసం ప్రతి క్లస్టర్‌కు సీమెన్స్ కేటాయించిన రూ. 13.31 కోట్ల అంచనా వ్యయం సరైనదని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఆమోదించింది.
  2. 476 డిజిటల్ కోర్సులను అందించడానికి ప్రతీ క్లస్టర్‌కు 249.75 కోట్లు అవుతుందన్న సీమెన్స్ అంచనా వ్యయం ఆమోదయోగ్యమైనదిగా ధృవీకరించబడింది.
  3. సాఫ్ట్‌వేర్ కోసం, ప్రతి క్లస్టర్‌కు 247.78 కోట్లు అంచనా వ్యయం అవుతుందన్న సీమెన్స్ ప్రతిపాదన అంగీకరించబడింది.
  4. హార్డ్‌వేర్ కోసం, ప్రతి క్లస్టర్‌కు మొత్తం 48.48 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్న సిమెన్స్ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనదని ధృవీకరించబడింది.

ఒక్కో క్లస్టర్ కి రూ. 559.33 కోట్ల ఖర్చు సహేతుకమైనదని CITD ధృవీకరించింది.

సంబంధిత పత్రాలు:

డాక్యుమెంట్

వివరణ

సిటీడ్ ఎవాల్యూయేషన్

ప్రతిపాదనపై చేసిన వాల్యుయేషన్ వివరాలు

APSSDC, Simens, DesignTech ప్రాజెక్ట్‌లో కీలకమైన వాటాదారులు.

క్రమ సంఖ్య

ఏజెన్సీ

రోల్

1

APSSDC

COEలు మరియు T-SDIల గుర్తింపు - వాటి కమ్యూనికేషన్, ల్యాబ్ స్థలాల కేటాయింపు

2

Siemens

SISW అనేది DesignTechకి సాంకేతిక భాగస్వామి, ప్రోగ్రామ్ సలహాదారు. పరిశ్రమల ఇంటరాక్టివ్ సెషన్‌లను నిర్వహించడం, విద్యార్థుల పోటీలు, డిజైన్‌టెక్ ఫ్యాకల్టీకి శిక్షణ, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వంటి బాధ్యతలు ఉంటాయి.

3

DesignTech

ప్రాజెక్ట్ మొత్తాన్ని చూసుకొనే సిస్టమ్ ఇంటిగ్రేటర్, ఇంప్లిమెంటర్. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇన్‌స్టాలేషన్, ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం, విద్యార్థులను చేర్చుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. పరిశ్రమల ఇంటరాక్టివ్ సెషన్‌లు, విద్యార్థుల పోటీలు, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంది

4

Institutes identified for skill development 

ల్యాబ్ స్థలాల కేటాయింపు మరియు ప్రాజెక్టును కనీసం 10 సంవత్సరాల పాటు నిర్వహించడం

అవును, గుజరాత్, తమిళనాడు మరియు జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే డిజైన్ టెక్ ప్రాజెక్ట్‌ని అమలు చేసే భాగస్వామి. భారతదేశంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ చేసుకున్న అన్ని ఒప్పందాలలో డిజైన్ టెక్ సంస్థ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటర్, సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా పనిచేస్తుంది.

అవును, 31 మే 2018 నాటికి మొత్తం 40 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మార్చి 2020 నాటికి ఈ కేంద్రాలలో సుమారు 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ వ్యవధి పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టు తాలూకు ఆస్తులు APPSDC మరియు హోస్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి అందజేయబడతాయి.

లేదు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ-సహాయక కళాశాలలలో కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

  1. SIEMENS స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేసిన ప్రతి 4 ఇన్‌స్టిట్యూట్‌లలో 1 గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌. మరికొన్ని ప్రభుత్వ సహాయం పొందిన సంస్థలు.
  2. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా మొత్తం 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 70,000 మంది ఉపాధి పొందారు.
  1. సిమెన్స్ COE , t-SDI లు ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థులు, ఫ్యాకల్టీకి వరల్డ్ క్లాస్ సీమెన్స్ ఎక్విప్‌మెంట్ & సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. COE, T-SDI సిమెన్స్-సర్టిఫైడ్ భాగస్వాముల ద్వారా శిక్షణను అందిస్తాయి. పరిశ్రమ ఉపయోగించే అదే పరికరాలు/సాఫ్ట్‌వేర్‌తో శిక్షణ అందించి COE, T-SDI విద్యార్థి సమాజానికి నైపుణ్యాన్ని పెంపొందించి ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ శిక్షణలో చేరిన వారు పరిశ్రమలోని ఉత్తమ అభ్యాసాలను పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే సిమెన్స్ సర్టిఫికేషన్ వల్ల శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధి సులువుగా లభిస్తుంది.
  2. సీమెన్స్ ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, షిప్ బిల్డింగ్ మొదలైన వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తుంది.
  3. ఈ అన్ని రంగాలు, వారి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడానికి వారికి శిక్షణ పొందిన మానవ వనరులు అవసరం. అందుకే వారు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు మద్దతు ఇస్తూ అనేక మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి, తమ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధంగా ట్రైన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అందించడం ద్వారా ప్రజలు దానిపై శిక్షణ పొందగలరు. తద్వారా సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు.
  4. సీమెన్స్ అలాగే దానిని అమలు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.సీమెన్స్ తమకు అవసరమైన మానవ వనరుల్ని సమకూర్చుకోవడంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పిస్తుంది.
  5. ఇది ఒక గ్రాంట్స్ ప్రక్రియ. 90:10 ప్రైవేట్ పబ్లిక్ టెక్నాలజీ భాగస్వామ్యాలలో IT కంపెనీలు, ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతులు అనుసరిస్తాయి. ఈ రకమైన ప్రాజెక్టులలో సాధారణంగా టెండర్‌లు ఉండవు. ఆ ప్రక్రియనే సీమెన్స్/డిజైన్‌టెక్ & గత AP ప్రభుత్వం అనుసరించింది.
  6. ప్రపంచవ్యాప్తంగా సిన్సినాటి, వాషింగ్టన్ వంటి అనేక విశ్వవిద్యాలయాలు ఇదే విధానాన్ని అమలు చేశాయి. భారతదేశంలో కూడా NIT వరంగల్, MIT (మణిపాల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లతో పాటు గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆరోపణ 1: క్షేత్ర స్థాయిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.

నిజం:

  •   వాస్తవానికి, 34 TSDIలు (టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు) మరియు 6 COEలు (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. అవి సమర్ధవంతంగా చేస్తున్నాయి.
  • ఇదే విషయాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వంలోని సీనియర్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ అధికారికంగా ధ్రువీకరించారు. APలో ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు డిజైన్ టెక్ (సీమెన్స్ భాగస్వామి)కి ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు.
  •  ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లన్నింటినీ సీమెన్స్-డిజైన్ టెక్ నుంచి సంబంధిత కళాశాలలకు అప్పగించడం కూడా జగన్ రెడ్డి హయాంలో ఆగస్టు 2021 నుంచి జరిగింది.
  • ఈ కేంద్రాలు అన్ని సంస్థలు, ఐఐఐటీ ఇడుపులపాయతో కలిపి లిఖితపూర్వకంగా లేఖలు రాశాయి. మొత్తం పరికరాలు మరియు సాఫ్ట్ వేర్ అందించబడ్డాయని, సరిగా పని చేస్తున్నాయని తెలిపాయి. కేంద్రాల్లో ఉన్న స్టాక్‌ రిజిస్టర్లపై కూడా సంతకం చేశాయి. ఈ విషయాన్ని ఈ కేంద్రాలు ఐఐఐటీ ఇడుపులపాయతో కలిపి లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చాయి. కేంద్రాల్లో ఉన్న స్టాక్‌ రిజిస్టర్లపై కూడా సంతకం చేశాయి.
  • డిజైన్‌టెక్ వ్యవస్థాపకుడు వికాస్ ఖాన్వేల్కర్ మాట్లాడుతూ 'ఎంపిక చేసిన 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో 286 ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. ఈ ల్యాబ్ లను 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పాము. ఈ ప్రాజెక్ట్ లో ఎంపిక చేసిన ప్రతీ సైట్ ను మేము స్వయంగా ఆమోదించాము. పూర్తి స్థాయిలో ల్యాబ్ లు ఏర్పాటైన తరువాత వారికి సంబంధిత పరికరాలు అందించాము. సుమారు 50 ట్రక్కులతో పరికరాలను అందించాము. ఇలా ప్రతీ డెలివరీని దగ్గరుండి పర్యవేక్షించి లొకేషన్‌లలో డెలివరీ చేశాము. వాటిని అన్‌ప్యాక్ చేసి అనంతరం వాటిని సరైన ప్రదేశాలలో ఇన్‌స్టాలేషన్ చేసాము. కావాలంటే వాటిని ప్రస్తుతం మీరు ఆ ల్యాబ్ లలో చూడొచ్చు. ’ అని అన్నారు. 

ఆరోపణ 2: వివిధ షెల్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించి దోచుకున్నారు

నిజం:

  •  ఇది పూర్తిగా GST పన్ను ఎగవేతఇది పూర్తిగా పన్ను ఎగవేతకి సంబంధించినది. వివిధ కంపెనీలు నగదు బదిలీల బిల్లులతో GST పన్నుని తప్పించుకునేందుకు ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి క్లెయిమ్ చేసుకొని నిధులు దారిమళ్లించారు.
  •   ఏదైనా కంపెనీ పన్ను చెల్లించకుంటే, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా భాద్యత వహిస్తుందిమా వైపు నుంచి, మేము అవసరమైన GST పన్ను భాగాన్ని కలుపుకుని మొత్తం రూ.371 కోట్లు విడుదల చేశాము. ఈ పన్ను ఎగవేతకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
  •  సీబీఎన్ రిమాండ్ రిపోర్టులోనూ చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు కానీ వారికి చెందిన కంపెనీలకు కానీ నిధులు దారి మళ్లించినట్లు ఎలాంటి సాక్ష్యాలను అందించలేదు. 
  •  రిమాండ్‌ రిపోర్ట్‌లో 21వ పేజీ 10వ పేరాలో "వికాస్ ఖాన్విల్కర్‌ అనే వ్యక్తి నిధులు విత్‌డ్రా చేశారని.. ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందని" రాశారు. 
  •   ఈ ఆరోపణ ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఎవరికి చేరాయనే అంశాన్ని నేటికి కూడా సీబీఐ స్పష్టం చేయలేదు. దీన్నిబట్టి అసలు ఈ కేసులో చంద్రబాబుకి ఎటువంటి ప్రమేయం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.

ఆరోపణ 3: టెండర్లను ఆహ్వానించకుండా సీమెన్స్‌తో ఒప్పందం.

నిజం:

  •  సీమెన్స్ నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్ట్ 90% గ్రాంట్‌ ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వచ్చింది. ఏదైనా గ్రాంట్‌గా స్వీకరిస్తున్నప్పుడు టెండర్లను ఆహ్వానించాల్సిన అవసరం ఉండదు.
  •   సీమెన్స్ ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ పూర్తిగా పేటెంట్ పొందింది. మార్కెట్‌లోని మరే ఇతర కంపెనీకి ఇలాంటి సాఫ్ట్‌వేర్ లేదు. ఇది సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌కి ఉన్న ప్రత్యేకత.ఇంత పారదర్శకత ఉన్నప్పుడు టెండర్లు ఆహ్వానించాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది.? 
  •  జగన్ రెడ్డి బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నప్పుడు టెండర్లు పిలిచారా? ప్రభుత్వ బడుల కోసం బైజూస్ సంస్థ ‌అధిపతి రవీంద్రన్‌ ముందుకొచ్చారని జగన్‌ రెడ్డి పొగడ్తాలతో ముంచెత్తారు. కానీ ఇప్పుడు బైజూస్ పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.
  •  ఏపీకి చెందిన ఐఏఎస్‌ అధికారుల బృందం ఈ ఒప్పందాన్ని గుజరాత్‌లో ప్రాజెక్ట్‌ను పరిశీలించిన తర్వాతే సీమెన్స్‌తో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
  •  గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్ మొదలైన 9 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును అమలు చేశాయి. 9 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కోసం ఎటువంటి టెండర్లు వేయలేదు. నేరుగా ఒప్పందాలపై సంతకం చేశాయి.
  •  నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి టెండర్లు పిలవలేదు. సీమెన్స్‌తో ఒప్పందంపై ప్రధానిని ప్రశ్నించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
  • వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, సిన్సినాటి స్టేట్ టెక్నికల్ అండ్ కమ్యూనిటీ కాలేజ్, సదరన్ వర్జీనియా హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్ (SVHEC) వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు సీమెన్స్ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు గ్రాంట్‌గా పొందాయి. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ప్రయోజనం పొందకూడదు?

ఆరోపణ 4: ఈ ప్రాజెక్టు అమలులో హడావుడి ఎందుకు జరిగింది?

నిజం:

  •  ఈ ప్రాజెక్ట్ అమలు చేసేటప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి హడావుడి సృష్టించలేదు. ప్రాజెక్ట్‌లో ప్రతీ కీలక అంశానికి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
  • 30-06-2015న G.O M.S 4 విడుదల చేయబడింది. మొదటి నిధుల కింద రూ.185 కోట్లు 5-12-2015న ప్రభుత్వం విడుదల చేసింది. G.O రిలీజ్ చేసిన 5 నెలల తర్వాత జరిగిన మొదటి చెల్లింపు ఇది.
  •  అలా చూస్తే ప్రాజెక్ట్‌లో ఎక్కడ హడావిడి జరిగింది? గుజరాత్‌లో అమలవుతున్న ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తరఫున బృందాలను పంపారు. CITD (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) పరిశీలన కోసం కూడా సంప్రదించారు.ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు చేస్తున్నప్పుడు పారదర్శకత, నిర్ధారణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోబడ్డాయి.

ఆరోపణ 5: ఈ ప్రాజెక్టు లో రూ. 371 కోట్ల అవినీతి జరిగింది

నిజం:

  The Forensic Auditor’s report did not have the details of how much money was exactly misappropriated. Different figures are circulating in the media as there is no clarity about the amount being cited. Forensic auditor’s conclusion of not engaging a professional evaluator to evaluate project cost is incorrect as a central government agency, the Central Institute of Tool Design was engaged for the same.   Physical audit was eliminated from the scope of work of forensic auditor suspiciously in a pre-bid meeting though it was initially included. The investigation was based on inadequate information and faulty methodology to directly make any allegations of misappropriation.     

  •   ప్రభుత్వం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్, శరత్ అండ్ అసోసియేట్స్, జగన్ సొంత కంపెనీలైన ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఆడిటర్ సర్వర్ ఒకే ఐపీ సర్వర్‌ అడ్రస్‌తో ఉన్నాయి. శరత్ అసోసియేట్స్ డొమైన్: sarathcas.in. IVS అండ్‌ అసోసియేట్స్ డొమైన్: ivsassociates.in

                                               IP చిరునామా పోలిక:

                                                         115.124.126.242:80
                                                         115.124.126.216:80

                           ఈ రెండు ఏజెన్సీల వెబ్‌సైట్‌ల మధ్య సాన్నిహిత్యం ఫోరెన్సిక్ ఆడిటర్ మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని అనుమానించడానికి ఒక కారణం.

TELUGU